: తెలంగాణపై త్వరలోనే ఆమోదనీయమైన నిర్ణయం: కావూరి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలోనే అందరికీ ఆమోదనీయమైన నిర్ణయం వెలువడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆయన ఈ ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పదవి వచ్చిన తరువాత తాను మాట మార్చాననడం సరికాదన్నారు. రాష్ట్ర విభజనపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల్లో శాస్త్రీయత లేదని, ఇప్పుడు శాస్త్రీయంగా మాట్లాడుతున్నానని కావూరి తెలిపారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కావూరి అన్నారు.