: సమ్మె రోజుల్లో హైదరాబాదులో పోలీసుల ఆంక్షలు


కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె సందర్బంగా హైదరాబాదులో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ నెల 24 వరకు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ప్రదర్శనలు చేపట్టరాదని పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. అలాగే సమ్మె రోజుల్లో శాసనసభ, ట్యాంక్ బండ్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్  పరిసరాల్లో మైకుల వినియోగాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు  సమ్మె ప్రభావం ప్రయాణీకులపై పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఏడు ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

  • Loading...

More Telugu News