: పేలుళ్లు విచారకరం: మోడీ
గయలోని మహాబోధి ఆలయంపై దాడులు భారతీయులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు విచారకరమైన విషయమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరోవైపు ఈ పేలుళ్లను బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఇది సెక్యూరిటీ వైఫల్యంగా పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.