: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమల వెంకన్నను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో, భక్తులు బయట కూడా బారులు తీరి ఉన్నారు. దీంతో, తిరుమల వీధుల్లో కిలోమీటర్ల పొడవున భక్తులు బారులు తీరారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే 9 గంటలు పడుతోంది.