: వ్యాయామంతో మేలెంతో...
ఆరు నెలల పాటు వ్యాయామం చేస్తే మన శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించుకోవడంతోబాటు కొవ్వు పేరుకునే అవకాశం మన శరీరానికి ఇవ్వదంటున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన రక్తంలోని షుగర్ నిల్వలను కూడా తగ్గిస్తుందంటున్నారు.
శరీరంలో ఉండే అదనపు కేలరీలను కరిగించుకోవడానికి కాస్త కష్టతరమైన ఎక్సర్ సైజులు అవసరం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరు నెలల పాటు సైక్లింగ్, ఎరోబిక్స్ వంటివి చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించవచ్చని స్వీడిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఒక గంటపాటు వ్యాయామం బరువును తగ్గించడమే కాదు మన శరీరంలోని అదనపు కేలరీను తగ్గిస్తుంది. అలాగే డయబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా దూరంగా ఉంచుతుంది. మన మెదడును ఉల్లాసంగా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన శరీరం వల్ల ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. దానివల్ల మన ఆలోచనలు కూడా మంచి మార్గంలోనే సాగుతాయి అంటున్నారు అధ్యయనవేత్తలు. కాబట్టి చక్కగా వ్యాయామం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా!