: సెల్ వాడేవారికో హెచ్చరిక!
మీరు ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతున్నారా...? అయితే ఈ హెచ్చరిక మీకే... ఎక్కువగా సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపడం, గేమ్స్ ఆడడం వంటివి చేసేవారు మానసికంగాను, శారీరకంగాను బలహీనంగా తయారవుతారట. ఈ విషయాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది.
అమెరికాలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో రోజుకు 90 నిముషాల పాటు మొబైల్‌తో గడిపేవారి కంటే రోజులో 14 గంటల పాటు మొబైల్ వాడేవారు ఎక్కువగా బలహీనంగా తయారవుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని రన్నర్స్ వరల్డ్ వెల్లడించింది. ఇలా ఎక్కువగా మొబైల్ వాడేవారు దానికి బానిసలుగా మారుతూ మొబైల్‌తోనే ఎక్కువ సమయాన్ని గడిపేందుకు, ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తేలింది. ఒక్కరే వీడియో గేమ్స్ ఆడడం, ఒక్కరే సినిమాలు చూడడం వంటి వాటిపట్ల ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని అధ్యయన వేత్తలు చెబుతున్నారు. అలా కాకుండా, అవసరం మేరకు మొబైల్‌ను వాడేవారు మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా శారీరకంగా ఆరోగ్యంగా కూడా ఉంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. కాబట్టి ఎక్కువగా సెల్ వాడకం తగ్గిస్తే మంచిది.