: నితీష్ కు కాంగ్రెస్ మరో తాయిలం
బీహార్ ముఖ్యమంత్రిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా ఓ అడుగు ముందుకేసి బీహార్ లో 5,700 కిలో మీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణానికి గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 4,130 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్ వై) పధకం కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ మెత్తాన్ని కేటాయించాలని తమ శాఖ నిర్ణయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ తెలిపారు. గడచిన పదేళ్లలో బీహార్ కు దక్కిన అత్యధిక కేటాయింపు ఇదే. నితీష్ కు దగ్గరయ్యేందుకేనా ఈ భారీ తాయిలం? అన్న ప్రశ్నకు, 'కాదు కాదు, ఇది బీహార్ రాష్ట్ర హక్కు" అని మంత్రి చెప్పారు. దీంతో విలేకరులు అన్ని రాష్ట్రాలకు ఈ హక్కులు వర్తించవా? అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.