: తమిళనాడులో 250 కోట్ల రూపాయల అక్వేరియం
చెన్నైకి సమీపంలో మహాబలిపురంలో 250 కోట్ల రూపాయలతో భారీ అక్వేరియాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర పర్యాటక సంస్ధ, ప్రైవేటు సంస్ధల భాగస్వామ్యంతో దీన్ని కార్యరూపంలో తీసుకురానున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ అక్వేరియంను నిర్మించనున్నారు. ఈ అక్వేరియంలో డాల్పిన్స్ తో పాటు అత్యంత అరుదైన, ప్రాశస్త్యం కలిగిన పలు రకాల చేపలు, సముద్ర జలచరాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు అత్యంత స్పష్టంగా వీక్షించేందుకు అద్దాల గదులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ అక్వేరియం పరిధిలో చెరువులు, విశ్రాంతి గదులు, క్యాంటీన్లు, ఫౌంటెన్లతో పర్యాటకులకు కనువిందు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇది ఎప్పటికల్లా ఏర్పాటు చేస్తారో తెలపలేదు.