: ఆ ముగ్గురితో దేశానికి అథోగతే: సీపీఐ నేత దాస్ గుప్తా


ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా త్రయం దేశాన్ని ఆర్ధికంగా అథోగతి పాల్జేస్తున్నారని సీపీఐ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు దాస్ గుప్తా మండిపడ్డారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల కాలంలో తీసుకున్న అనేక ప్రజావ్యతిరేక, వ్యాపార, కార్పొరేట్ పక్షపాత ఆర్ధిక విధానాల వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని ద్వజమెత్తారు. రూపాయి మారకం విలువను తగ్గించడం ద్వారా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చనే కేంద్రం ఎత్తుగడ చిత్తయిందని వ్యాఖ్యానించారు. రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల దేశంలో ధరలు పెరుగుతాయన్న విచక్షణను వాళ్లు కోల్పోయారన్న గుప్తా, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటే ఇలాంటి విషయాలు ఆలోచించే వారని విమర్శించారు.

  • Loading...

More Telugu News