: అమెరికా శత్రు క్షిపణి, రక్షణ క్షిపణి పరీక్ష విఫలం


ఉత్తర కొరియా భయంతో అమెరికా ప్రతిష్ఠాత్మకంగా 3400 కోట్ల డాలర్లతో చేపట్టిన ఖరీదైన ప్రాజెక్టు మళ్లీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. శత్రుదేశాల క్షిపణి దాడులను కాచుకునేందుకు అమెరికా చేపట్టిన రక్షణ కార్యక్రమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన పరీక్ష విఫలమైంది. దూసుకొస్తున్న బాలిస్టిక్ క్షిపణిని, నిరోధక క్షిపణి ఢీ కొట్టలేకపోయింది. దీంతో అమెరికా రక్షణ విభాగం నిరాశ చెందింది. మార్షల్ దీవుల్లోని క్వాజెలైన్ ప్రయోగ కేంద్రం నుంచి ఒక దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని అమెరికా రక్షణ అధికారులు ప్రయోగించారు. దీన్ని నేల కూల్చేందుకు కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ వైమానిక స్థావరం నుంచి నిరోధక క్షిపణిని ప్రయోగించారు. అయితే ఇది బాలిస్టిక్ క్షిపణిని తాకలేదని పెంటగాన్ ప్రతినిధి రిచర్డ్ లెహ్నర్ తెలిపారు.

2008 నుంచి మొదలు పెట్టిన ఈ పరీక్షలు ఇప్పటివరకూ విజయవంతం కాలేదు. 2010 లో ఈ ప్రయోగం రెండు సార్లు విఫలమైంది. ఈ ప్రయోగం ముఖ్యోద్దేశం ఉత్తర కొరియా నుంచి వచ్చే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చడం. అయితే తాజా పరాజయంతో భారీ బడ్జెట్ తో శత్రుదేశాలనుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన రక్షణ క్షిపణి పరీక్షలు మరింత కాలం కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News