: నా తల్లిదండ్రుల విడాకులే నన్ను దర్శకుడ్ని చేశాయి:లుటేరా దర్శకుడు
'నా తల్లిదండ్రుల విడాకులే నన్ను దర్శకుడ్ని చేశాయని' బాలీవుడ్ తాజా సంచలనం 'లుటేరా' సినిమా దర్శకుడు విక్రమాదిత్య మొత్వానీ తెలిపారు. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని ఉండకపోతే ఇంజనీర్ అయిఉండేవాడినని ఆయన అన్నారు. తన తండ్రి సింధీ అయితే, తల్లి బెంగాలీ అన్న ఈ దర్శకుడు వారంలో సగం తల్లి దగ్గర, మిగిలిన సంగం తండ్రి దగ్గరా గడిపేవాడు. అయితే వారిద్దరి దగ్గరా ఉండి జీవితాన్ని చూడడంవల్ల తొందరగా విశాల దృక్పధాన్ని అలవాటు చేసుకున్నానని తెలిపాడు. తన జీవితం స్పూర్తిగానే తన తన తొలి సినిమా 'ఉడాన్'ను తీశానన్నారు. ఉడాన్ సినిమా బాలీవుడ్ లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. రణ్ వీర్ సింగ్, సోనాక్షిసిన్హా జంటగా తను తీసిన 'లుటేరా' సినిమా 1950 ల నాటి జమిందారీల కాలంనాటిది. అయినప్పటికీ విజయవంతమైన ప్రేమ కావ్యంగా ప్రదర్శితమవుతోంది.