: నైజీరియాలో నరమేధం
ఆఫ్రికా నిరుపేద దేశం నైజీరియాలో తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. ఓ పాఠశాలపై దాడిచేసి 42 మందిని పొట్టనబెట్టుకున్నారు. నిన్న రాత్రి యోబే రాష్ట్రంలోని మముడో పట్టణంలోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలపై దాడికి దిగిన తీవ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్థులతోపాటు పాఠశాల సిబ్బంది కూడా అసువులుబాశారు. ఈ దుశ్చర్య నిషిద్ధ 'బోకో హరామ్' ఇస్లామిక్ తీవ్రవాదుల పని అని భావిస్తున్నారు.