: ప్రభుత్వం పట్టించుకోలేదని సర్పంచి ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు
ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా జి.దొంతమూరు గ్రామస్థులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించారు. ధర్మల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 149 రోజులుగా దీక్షలు చేస్తుంటే, తమను పట్టించుకోని ప్రభుత్వం సర్పంచి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒక వేళ ఎన్నికలను జరిపినా ప్రభుత్వ వైఖరికి నిరసనగా బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుమానాస్పదంగా మారింది.