: సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లయిపోయిందా?
సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ లులియా వాంచూర్ కి పెళ్లయిపోయిందనే వార్తలు బాలీవుడ్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ హీరో రోమేనియన్ లవర్ కి ఇంతకు ముందే పెళ్లయిందన్న వార్త ఆయన అభిమానులను తెగ బాధిస్తోంది. అయితే అవన్నీ వదంతులని వారే సర్దుకుపోయారు. అయితే తాజాగా సల్మాన్ తన లవర్ తో హైదరాబాద్ లో 'మెంటల్' సినిమా షూటింగ్ కు వెళ్లాడంటూ వార్తలు షికారు చేశాయి . దీంతో మరోసారి వారి ప్రేమాయణంపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే రోమేనియన్ టీవీ యాంకర్ అయిన వాంచూర్ గతంలో గ్రామీ అవార్డు నామినీ మౌరిస్ మోగా తో డేటింగ్ చేసిందట.
డాన్సింగ్ విత్ ద స్టార్స్ టీవీ ప్రోగ్రామ్ కి ఈమె అతనితో పాటు వ్యాఖ్యతగా వ్యవహరించిందట. అప్పుడే వారిద్దరి మధ్య ఏర్పడ్డ అనుబంధం ప్రేమగా మారిందని, అది పెళ్లికి దారితీసిందని రోమేనియన్లు అంటున్నారు. వీరి పేరిట ఉన్న ఫేస్ బుక్ ఖాతాలో 7 ఆగస్టు 2012 పెళ్లి చేసుకున్నట్టు, దానికి అనుబంధంగా వీరిద్దరూ గాఢ చుంబనం(లిప్ లాక్) లో మునిగి తేలిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఈమెకు పెళ్లయిందా? లేదా? అసలు సల్మాన్ తో ఎఫైర్ నిజమేనా? అనేవి నిర్ధారించాలంటే సల్మాన్ నోరు విప్పాలి.