: ఈ ఏడాది ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు


ఈ ఏడాదికిగాను ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఫీజులను సర్కారు నేడు ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 697 కాలేజీలకు ఈ నూతన ఫీజుల విధానం వర్తిస్తుంది. వాటిలో 434 కాలేజీలకు గరిష్ఠంగా రూ.1,13,300.. కనిష్ఠంగా రూ.35,000 ఫీజుగా నిర్ణయించారు. మరో 195 కళాశాలలకు రూ.30,000 ఫీజుగా నిర్ణయించారు. మూడేళ్ళకు ఈ ఫీజులు వర్తిస్తాయి.

  • Loading...

More Telugu News