: ముగిసిన సీమ సింహగర్జన
ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తో బైరెడ్డి రాజశేఖరరెడ్డి హైదరాబాద్ లోని ఇందిరపార్కు వద్ద చేపట్టిన 52 గంటల రాయలసీమ సింహగర్జన దీక్ష నేటి సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజలను మేల్కొల్పేందుకే ఈ దీక్ష చేపట్టానని స్పష్టం చేశారు. రాయలసీమ నుంచి కర్మాగారాలు హైదరాబాద్ కు తరలిపోతే సీమ నేతలెవ్వరూ ప్రశ్నించలేదన్నారు. ఇప్పటికే సీమలో అనేక కంపెనీలు మూతపడ్డాయని తెలిపారు. రాయలసీమ నేతలే రాష్ట్రాన్ని పాలించినా ఫలితం లేదన్నారు. చంద్రబాబు, విజయమ్మలు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నా తమ ప్రాంతానికి చేసిందేమీ లేదంటూ విమర్శించారు. సాక్షాత్తూ సీఎం సీమ వాడైనా తమ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.