: ఎన్టీఆర్ భవన్ లో పని చేస్తానన్న హరీష్ రావెక్కడ : ఎర్రబెల్లి


టీడీపీ తెలంగాణకు వ్యతిరేకమని ఎవరైనా అంటే వారిని తరిమి కొట్టండని ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే టీడీపీ కార్యాలయంలో పని చేస్తానని చెప్పిన హరీష్ రావు ఇప్పుడేమయ్యాడంటూ ఆయన ప్రశ్నించారు. ఊర్లలో కాంగ్రెస్ వాళ్లను తరిమి కొట్టాలని పిలుపునిస్తున్న టీజేఏసీ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ల ఇళ్లకు వెళ్లి తినడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. మరో నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ అని పేరు పెట్టుకుని ఆయన స్థాపించిన పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News