: టీడీపీలో చేరిన డీకే సమరసింహారెడ్డి
మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీడీపీ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు నాయుడు సమక్షంలో డీకేతో పాటు మరో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సమరసింహారెడ్డి 1999లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కొద్దికాలానికే ఆ పార్టీని వీడారు. సమరసింహారెడ్డికి.. తన సోదరుడు భరతసింహారెడ్డి భార్య, మంత్రి డీకే అరుణతో కొద్దికాలంగా పొసగడంలేదు. జిల్లా రాజకీయాల్లో వీరిమధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.