: కంచే చేను మేసింది.. ఫలితం కటకటాల పాలు
కంచే చేను మేస్తే ఆ పాపం ఊరికే పోతుందా... కటకటాలపాలు చేస్తుంది. గంపెడాశలతో తన అవసరాలు తీర్చుకునేందుకు బంగారం తాకట్టు పెట్టిన వ్యక్తిని మోసం చేశాడు, ఓ తాకట్టు సంస్ధ మేనేజర్. దీంతో అతను వినియోగదారులను మోసగించాడనే నేరం క్రింద ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. గడ్డిఅన్నారంలోని ముత్తూట్ ఫిన్ కార్ప్ సంస్థలో ఇటీవల ఓ వినియోగదారుడు 23 తులాల బంగారం తాకట్టు పెట్టాడు. కొన్నాళ్ళకు వడ్డీ సహా అసలు కట్టేసి, తన నగలు తనకు ఇవ్వాలని కోరగా, సంస్థలో బంగారం లేదని సిబ్బంది చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వినియోగదారుడు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు మేనేజరే ఆ బంగారాన్ని వేరే సంస్థలో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. దీంతో మేనేజర్ అనిల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.