: హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి: జేసీ
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే రాష్ట్ర విభజన తేలికవుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు తప్పవన్నారు. అదే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, నీటి సమస్యను పరిష్కరించుకుంటే విభజనకు వ్యతిరేకత ఉండదని స్పష్టం చేశారు.