: విజిలెన్స్ టఫ్ జాబ్
విజిలెన్స్ జాబ్ టఫెస్ట్ జాబ్ అని మాజీ డీజీపీ హెచ్ జే దొర అన్నారు. హైదరాబాద్ లో విజిలెన్స్ స్టడీ సర్కిల్ పదో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ విభాగం కీలకమైనదని, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. విజిలెన్స్ కమీషనర్ శ్రీకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును కాపాడే బాధ్యత అందరిమీదా ఉందన్నారు. అవినీతిని నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు కలసి పని చేయాలన్నారు. మోసాలు, అవినీతి బయటపెట్టడంలో చీఫ్ విజిలెన్స్ అధికారుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు.