: ఇలాగైతే నిజాయతీపరులు ముందుకెలా వస్తారు?: జేపీ
ఇటీవల ఎన్నికల ఖర్చు వివరాలు వెల్లడించి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన మహారాష్ట్ర ఎంపీ గోపీనాథ్ ముండేకు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ బాసటగా నిలిచారు. ఎన్నికల ఖర్చును నిజాయతీగా వెల్లడించినందుకు ముండేకు ఎన్నికల సంఘం నోటీసులివ్వడం సరికాదన్నారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఇలా చేస్తే నిజాయతీపరులు ఎలా ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. ఈసీ వైఖరి ఎన్నికల సంస్కరణలకు పాతర వేసేదిగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వీఎన్ సంపత్ కు జేపీ లేఖ రాశారు.