: ఆన్ లైన్లో రేపిస్టుల వివరాలు
అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలను ఇక నుంచి ఆన్ లైన్లో ఉంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. జస్టిస్ వర్మ కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, గత మూడు దశాబ్దాలుగా అత్యాచారాలకు పాల్పడి, శిక్షకు గురైన వ్యక్తుల పూర్తి వివరాలను ఫొటోలతో సహా ఢిల్లీ పోలీస్ వెబ్ సైట్లో ఉంచనున్నారు. ఈ విధానం ద్వారా.. పదేపదే అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం సులువవుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 664 మంది రేపిస్టుల వివరాలు అప్ లోడ్ చేశామని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ వివరాలను తెలుసుకోవాలంటే.. delhipolice.nic.in లో లాగ్ ఇన్ అయి 'sexual offenders' అన్న ఆప్షన్ పై క్లిక్ చేస్తే రేపిస్టుల వివరాలు ప్రత్యక్షమవుతాయి.