: దూకుడు పెంచిన చంద్రబాబు!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. టీఆర్ఎస్ తోపాటు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ.. కేసీఆర్ కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఇక్కడివారికి ఒరిగిందేమీలేదని అన్నారు. బీడీకట్టలపై పుర్రె బొమ్మ ముద్రించడం ద్వారా రాష్ట్రంలోని వేలాది బీడీ కార్మికుల పొట్టగొట్టారని బాబు దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో హైదరాబాద్ లో వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే టీఆర్ఎస్ ఒక్కమాటా మాట్లాడలేదని ఆరోపించారు.

హైదరాబాద్ ఆదాయం తమ హయాంలోనే పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయంటూ.. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికైనా కాంగ్రెస్ లో విలీనమయ్యేవే అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News