: టీడీపీని వీడింది నేతలే, ఒక్క కార్యకర్త బయటికెళ్ళలేదు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధినేత చంద్రబాబు నాయుడు అభిమానం కురిపించారు. అధికారం కోసం కొందరు నాయకులు పార్టీని వీడినా.. ఒక్క కార్యకర్త కూడా పార్టీ నుంచి బయటికెళ్ళలేదని బాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నేడు కొంపల్లి ఎక్స్ లెన్సీ గార్డెన్స్ లో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు నీతినిజాయతీలకు మారుపేరని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని, వారు తనకు ప్రాణసమానమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.