: ఓ టెర్రిరస్టును కాపాడేందుకు కాంగ్రెస్ కు అంత ఆరాటం ఎందుకు?: వెంకయ్య నాయుడు
గుజరాత్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇష్రాత్ జహాన్ టెర్రరిస్టు కాదు అని చెప్పేందుకు కాంగ్రెస్ ఎందుకంత ఆరాటపడుతోందో అర్థం కావడంలేదని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇష్రాత్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇష్రాత్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారగలదని అర్థమయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దెబ్బతీసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని కూడా ఓటుబ్యాంకుగా మార్చుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని వెంకయ్య దుయ్యబట్టారు.