: దేశరాజధానిలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
దేశరాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీ తూర్పు ప్రాంతమైన జఫ్రాబాద్ లో వేకువజామున ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు 14 మందిని రక్షించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.