: రీబాక్ ఇండియా మాజీ సారధులపై అభియోగాల నమోదు
సరుకుల దొంగతనం కేసులో రీబాక్ ఇండియా మాజీ ఎండీ సుభీందర్ సింగ్ ప్రేమ్, సీఈఓ విష్ణు భగత్, మరో ముగ్గురు కంపెనీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ లోని కోర్టు అభియోగాలు నమోదు చేసింది. మరో ఆరుగురిపై నేరాభియోగాలు నమోదు చేసింది. నిందితుల చర్యలకు సంబంధించి సాక్షులను కోర్టు విచారించనుంది.
కంపెనీలో జరిగిన స్కాముపై గత మే నెలలో రీబాక్ గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభీందర్ సింగ్, విష్ణు భగత్ దొంగ రహస్య గోడౌన్లు ఏర్పాటు చేసి దొంగతనంగా సరుకులను అక్కడకు తరలించారని, కంపెనీ ఖాతాలలో అక్రమాలకు పాల్పడి నష్టాలకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసులో పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు.