: టీటీడీ ఈవోగా గోపాల్ బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) కొత్త ఈవోగా ఎం. గోపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈవోగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపంలో గోపాల్ తో జేఈవో శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించగా, రంగనాయకుల మండపంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. అర్చకులు ఆశీర్వచనం పలికారు.