: వదలకుండా వేధించే దగ్గుతో ప్రమాదమే


మూడు నాలుగు వారాలుగా దగ్గు వదలకుండా మిమ్మల్ని వేధిస్తోందా? అయితే మీరు జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇలా ఎక్కువ కాలం పాటు వదలకుండా ఉండే జబ్బు ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

లంగ్‌ క్యాన్సర్‌ ద్వారా మరణించే వారి సంఖ్యను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ క్యాన్సర్‌ గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు 'బీ క్లియర్‌ ఆన్‌ క్యాన్సర్‌' అనే ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇందులో యాభైయేళ్ల వయసువారిని ప్రధానంగా తీసుకున్నారు. ఈ వయసులోని వారికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాగా విపరీతమైన దగ్గు రావడం, పదే పదే ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ రావడం, దగ్గినపుడు రక్తం పడడం, ఊపిరి పీల్చలేకపోవడం, ఒక్కోసారి ఎక్కువగా అలసిపోవడం, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి రావడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం గురించి హెల్త్‌ సెక్రటరీ జెర్మే హంట్‌ చెబుతూ ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశ్యం ఏమంటే మీకు తరచూ విపరీతంగా దగ్గు వస్తుంటే వెంటనే వైద్యుణ్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స కన్నా రాకముందే పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సహాయం తీసుకుంటే మంచిదే కదా అని హంట్‌ అంటున్నారు.

  • Loading...

More Telugu News