: మద్యం సిండికేట్లపై పూర్తి నివేదిక ఇవ్వండి: హైకోర్టు
మద్యం సిండికేట్ల వ్యవహారంలో మొత్తం 1,122 మందిపై అభియోగపత్రం నమోదు చేయబోతున్నట్లు అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 929మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై విచారణకు అనుమతులు వచ్చాయంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు..కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.