: టీటీడీలో ఉద్యోగం వరమే: ఎల్వీ సుబ్రహ్మణ్యం
వెంకటేశ్వర స్వామి వారి క్షణిక దర్శనమే దుర్లభమైన టీటీడీలో రెండేళ్ల పాటు ఉద్యోగం చేయడం వరమని టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తన జీవితంలో విలువైన కాలాన్ని ఇక్కడే గడిపానని అన్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం స్వామివారిని దర్శించుకున్న ఆయన, పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి తలనీలాలు సమర్పించారు. అనంతరం ఆయనకు టీటీడీ అర్చకులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు మేళతాళాలతో వీడ్కోలు పలికారు.