: ఆర్టీసీ యూనియన్లలో భగ్గుమన్న విభేదాలు


డిమాండ్ల సాధనకు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె ఆర్టీసీ గుర్తింపు సంఘాల విభేధాల కారణంగా విఫలమైంది. గుర్తింపు కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ సమ్మెను అర్ధాంతరంగా విరమించుకోవడంపై మిగిలిన ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికుల సమస్యలపై స్పష్టమైన హామీ రాకుండానే యాజమాన్యంతో కుమ్మక్కై సమ్మెను విరమించుకున్నాయని ఎన్ఎంయూ, ఎన్ డబ్ల్యూఎఫ్ ఆరోపించాయి. యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘాల మధ్య జరిగిన ఒప్పంద ప్రతిలో అనేక లొసుగులు ఉన్నట్టు కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. గుర్తింపు సంఘాల వైఖరి వల్ల కార్మికులు దగా పడ్డారని విమర్శించారు. త్వరలో పెద్దఎత్తున మరో ఆందోళనకు దిగనున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News