: లక్ష్యసాధన దిశగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు మరింత చేరువయ్యేందుకు సిద్దమవుతోంది. విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో ముందున్న యూనివర్సిటీ ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేని కారణంగా సాంకేతిక సాధనాలవైపు మరలాలని సూచిస్తోంది. యాంత్రికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరిసేద్యం చేపడితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఇక్కడి ఆచార్యులు తెలుపుతున్నారు. యూనివర్సిటీలో జరిగిన ఖరీఫ్ వ్యవసాయ దృశ్య వివరణ కార్యక్రమానికి వీసీ హాజరయ్యారు. బీటీ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా బీటీయేతర సంకర జాతి, నాణ్యమైన అధిక దిగుబడులనిచ్చే విత్తనాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు కోనుగోలు చేసి వినియోగించుకోవచ్చని వీసి అల్లూరి పద్మరాజు తెలిపారు. రైతులకు మెరుగైన వ్యవసాయ విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్మితమైన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ లక్ష్యసాధన దిశగా అడుగులేస్తోందని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.