: ఆ గ్రామానికి ఇద్దరు సర్పంచులు


అవునండీ, నిజమే.. ఆ గ్రామానికి ఇద్దరు సర్పంచులు. కాకపోతే ఏకకాలంలో కాదు, చెరి రెండున్నరేళ్లు ఆ గ్రామానికి ఏకఛత్రాధిపత్యం వహించనున్నారు. గుంటూరు జిల్లా మూలపాలెం పంచాయతీ సర్పంచ్ పదవికి గ్రామపెద్దలు వేలం నిర్వహించారు. వారి డిమాండ్లకు ఒప్పుకున్న ఇద్దరు వ్యక్తులకు చెరి 2.5 లక్షల రూపాయలు చర్చి నిర్మాణానికి చెల్లించి, చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం చేసారు. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణం స్పందించి గ్రామపెద్దలతో సమావేశమై వేలం నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని సూచించారు.

  • Loading...

More Telugu News