: అమర్ నాథ్ యాత్రలో అపశృతి
కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున సాగే అమర్ నాథ్ యాత్ర లో నేడు అపశృతి చోటు చేసుకుంది. మార్గమధ్యంలో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మధ్యప్రదేశ్ కు చెందిన అశ్వినీ పాటిల్, గుజరాత్ కు చెందిన కృష్ణ్ కాంజీ కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో కృష్ణ్ కాంజీ అనే వ్యక్తి అమర్ నాథ్ గుహను సమీపిస్తుండగా ప్రాణాలు విడిచారు.