: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం చైనా డ్రైవర్ వింత నాటకం


ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఓ చైనా డ్రైవర్ ఏం చేశాడో చూడండి. తన కారుతో దాదాపు 334 యాక్సిడెంట్లకు పాల్పడ్డాడు. ఇదంతా కూడా ప్రమాద బీమా పరిహారం పొందడానికేనట! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇన్నాళ్ళకు అతగాడి అతి తెలివి బయటపడింది. ఎట్టకేలకు ఈ యాక్సిడెంట్ స్పెషలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. చైనా దక్షిణాది నగరమైన షెంజెన్ లో నివాసముండే ఈ 42 ఏళ్ళ డ్రైవర్ 2010 మే నుంచి ఇప్పటిదాకా ఈ యాక్సిడెంట్ల పర్వం కొనసాగించాడని పోలీసులు తెలిపారు.

సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారి కారును తీసుకెళ్ళి ఢీ కొట్టేవాడని వారు వెల్లడించారు. పైగా, తనకు గాయాలవకుండా కారుతో ఎంతో జాగ్రత్తగా ఇతర వాహనాలకు వెనుకభాగంలో డాష్ ఇచ్చేవాడట. ఇక మెకానిక్కులను మేనేజ్ చేసి డ్యామేజి ఎక్కువ చేసి చూపేవాడట ఇన్సూరెన్స్ అధికారులకు. ఇప్పటివరకూ మనోడు ఆ విధంగా రూ.35 లక్షల వరకూ నొక్కేశాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News