: కేజీ బేసిన్ లో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది: నారాయణ


కాకినాడ కేంద్రంగా ఉన్న కృష్ణా, గోదావరి (కెజి) బేసిన్ లో ఇంధన వనరుల కుంభకోణం భారీఎత్తున జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రిలయన్స్ కబంధహస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజల్ని పరిపాలిస్తోందని ఆయన ఆక్షేపించారు. కేజీ బేసిన్ లో లక్ష కోట్ల కుంభకోణం జరిగినా ఎలాంటి చర్య తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ బ్లాక్ మెయిలింగ్ లో మన్మొహన్ గుత్తేదారుల దయా దాక్షిణ్యాల మధ్య దేశాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ నిక్షేపాల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు ఈ నెల 11 న హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తొమ్మిది వామపక్ష పార్టీలతో సదస్సు, 15 న ఛలో కాకినాడ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News