: 36 కోట్ల వజ్రాల నెక్లెస్ దోచుకున్న దొంగలు
ముచ్చట పడి కొనుక్కున్న నగలంటే ఆడవాళ్లకి ఎంతో ప్రీతి... అయితే బ్రెజిల్ లో ఓ మహిళకు మాత్రం అలా ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన వజ్రాల నెక్లెస్ వేదనని మిగిల్చింది. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణీకురాలి మెడలోని 36 కోట్ల విలువైన వజ్రాల నెక్లెసుని దుండగులు తెంచుకుపోయారు. దొంగతనంపై పూర్తి సమాచారం ఇంకా తెలియలేదని..విమానాశ్రయం వెనుక వైపు నుంచి దుండగలు ప్రవేశించారని భద్రతాధికారులు తెలిపారు. అయితే ఈ నెక్లెస్ లోని ఓ వజ్రం ప్రపంచంలోనే పెద్ద వజ్రాల్లో ఒకటని సమాచారం.