: ఆధార్ అక్రమార్కులపై కొరడా
కాసులిస్తే ఆధార్ కార్డులు జారీ చేస్తున్న వైనంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఆధార్ కార్డుల జారీలో అవకతవకలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు వెనుకాడవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆధార్ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బజార్ ఘాట్, లక్ష్మీనగర్ ఆధార్ కేంద్రాలు జూలై 1 నే మూసి వేయాల్సి ఉందని, అయినప్పటికీ వారెలా ఆధార్ కార్డులు జారీ చేశారో తెలియదని, దీనిపై విచారణకు అదేశించామని మంత్రి తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.