: వెయ్యిమంది సోనియాలు, లక్షమంది దిగ్విజయ్ లు వచ్చినా విడగొట్టలేరు: మంద కృష్ణ


రాయలసీమను విడగొడితే ఊరుకునేదిలేదంటూ 52 గంటల దీక్షకు ఉపక్రమించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి మంద కృష్ణ మద్దతు ప్రకటించారు. రాయలసీమ ఆత్మగౌరవం పేరిట చేపట్టిన ఈ దీక్ష ఇందిరాపార్క్ వద్ద నిన్నటినుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మంద కృష్ణ నేడు దీక్షాస్థలి వద్దకు విచ్చేశారు. బైరెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. వెయ్యిమంది సోనియాలు, లక్షమంది దిగ్విజయ్ లు వచ్చినా రాయలసీమ జిల్లాలను విడగొట్టలేరని వ్యాఖ్యానించారు.

రాయలసీమను ముక్కలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రణాళికలు రచిస్తుంటే, సీఎం కిరణ్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతూ కుర్చీని కాపాడుకోవడంతోనే సీఎంకు సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఈ విషయమై నోరు విప్పకపోతే 52 మంది ఎమ్మెల్యేలకు ప్రజలు ఘోరీలు కట్టడం ఖాయమని మంద కృష్ణ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News