: పనిమనిషితో స్వలింగ సంపర్కం.. రాజీనామా చేసిన ఎంపీ మంత్రి


మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి రాఘవ్ రాజీనామా చేశారు. మంత్రిగారి అసభ్య కార్యకలాపాల వీడియో బయటకు రావడంతో ఆయన అవమాన భారంతో తలదించుకుని పదవి నుంచి తప్పుకున్నారు. తనకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనతో స్వలింగ సంపర్కం నెరిపారంటూ మంత్రిగారిపై ఆయన ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, మంత్రిగారికి చెందిన ఇద్దరు అనుచరులు కూడా తనతో అలాంటి పనులే చేశారని పేర్కొన్నాడు. ఇందుకు నిదర్శనంగా రాసలీలల వీడియోను పోలీసులకు అందించాడు. దీనిని మంత్రిగారి ఇంట్లో మరో పనిమనిషి చిత్రీకరించినట్లుగా చెప్పాడు. దీనిపై పోలీసులు అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయలేదని సమాచారం.

  • Loading...

More Telugu News