: చంచల్ గూడ జైల్లో టెలిఫోన్ బూత్
రాష్ట్ర జైళ్ళశాఖ నూతన సంస్కరణల్లో భాగంగా ఖైదీలకు పలు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా చంచల్ గూడ జైల్లో ఖైదీల సౌకర్యార్థం టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేశారు. ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఈ ఫోన్ సదుపాయం కల్పించినట్టు జైళ్ళ శాఖ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన ఈ ఉదయం ఈ టెలిఫోన్ బూత్ ను ప్రారంభించారు. జైలు నియమావళి ప్రకారం ఖైదీలు వారానికి రెండుసార్లు ఐదేసి నిమిషాలపాటు మాట్లాడుకోవచ్చు.