: డిపాజిటర్లకు ఏటా రూ.2,500కోట్ల నష్టం
బ్యాంకుల తిరకాసు నిబంధనలు ఖాతాదారుల జేబులకు కన్నాలు వేస్తున్నాయి. డిపాజిట్లపై బ్యాంకులు త్రైమాసిక వడ్డీని చెల్లించడం వల్ల డిపాజిటర్లు ఏటా రూ.2,500కోట్లను నష్టపోతున్నారని ముంబై ఐఐటీ లెక్కతేల్చింది. బ్యాంకులు ఖాతాదారులకు జారీ చేసే రుణాలపై వడ్డీని నెలనెలా వసూలు చేసుకుంటున్నాయి. అదే ఖాతాదారులు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముపై మాత్రం మూడు నెలలకోసారి వడ్డీ లెక్కింపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇవీ భారతీయ బ్యాంకుల లాభదాయక విధానాలు.