: బ్రిటన్ ప్రధానితో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమావేశం
మూడు రోజుల పాటు భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని 'దేవి మెమోరియల్ కళాశాల' విద్యార్ధులతో కొద్దిసేపు ఉత్సాహంగా మాట్లాడారు.
ప్రముఖ పత్రిక 'టైమ్ మ్యాగజైన్'పై అమీర్ ముఖచిత్రం ప్ర్రచురించాక యూకేలో ఆయనకు పెరుగుతున్న పాప్యులారిటీని విన్నకామెరూన్ అమీర్ ను కలవాలని ఆకాంక్షను వ్యక్తం చేయడంతో ఢిల్లీలో ఈ భేటీని ఏర్పాటుచేశారు.
సామాజిక అంశాలను తీసుకొని అమీర్ నిర్వహిస్తోన్నటీవీ కార్యక్రమం 'సత్యమేవ జయతే' పట్ల బ్రిటన్ ప్రధాని ఆసక్తి చూపారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు అమీర్ కలుసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బ్రిటన్ ప్రధానిని కలుసుకొన్న ఒకే ఒక్క హిందీ నటుడు అమీర్ కావడం విశేషం!