: హెలికాప్టర్ కుంభకోణం దర్యాప్తులో బ్రిటన్ ప్రధాని సహకరిస్తామన్నారు: మన్మోహన్
దేశాన్ని కుదిపేసిన హెలికాప్టర్ల కుంభకోణం కేసులో దర్యాప్తు సందర్భంగా ఎలాంటి సమాచారన్నయినా ఇచ్చేందుకు బ్రిటన్ ప్రధాని తలూపారని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో మంగళవారం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ భేటీ అయ్యారు. అనంతరం మన్మోహన్ మాట్లాడుతూ, పూర్తి సహకారం అందిస్తామని కామెరూన్ హామీ ఇచ్చారని తెలిపారు.
హెలికాప్టర్ల కంపెనీ ఫిన్ మెకానికా ఇటలీ సంస్థ అయినప్పటికీ అగస్టా వెస్ట్ల్ లాండ్ హెలికాప్టర్ల తయారీని మాత్రం ఇంగ్లండ్ లో చేపడుతోంది. పైగా, భారత ప్రభుత్వంతో అగస్టా ఒప్పందం కుదిరేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి కూడా లండన్ వాసి కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం.. ఈ కేసు దర్యాప్తులో బ్రిటన్ సహకారం కోరుతోంది. భేటీ ముగిసిన తర్వాత కామెరూన్ మాట్లాడుతూ, 'సమాచారం కోసం చేసే ఏ అభ్యర్థనకు అయినా మేం స్పందిస్తాం. అలాగే, ఈ వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం కూడా చురుగ్గా స్పందించడం హర్షణీయం' అని వ్యాఖ్యానించారు.