: కప్ కావాలంటే నేడు గెలవాలి
వెస్టిండీస్ గడ్డపై ముక్కోణపు వన్డే క్రికెట్ సిరీస్ లో రెండు వరుస పరాజయాలను మూటగట్టుకున్న భారత్ కు నేడు జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. ఇందులో తప్పకుండా గెలవాల్సిన అవసరం భారత్ జట్టు ముందుంది. విండీస్ తో నేడు జరుగుతున్న మ్యాచులో ఓటమి పాలైతే భారత్ కు ఫైనల్ అవకాశాలు మూసుకుపోయినట్లే, అనుకోనిదేదైనా జరిగితే తప్ప. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి మ్యాచ్ కు కూడా విరాట్ కోహ్లీనే సారధ్యం వహించనున్నాడు. ఇతడి కెప్టెన్సీలోనే శ్రీలంకపై మ్యాచులో భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.