: త్వరలో హైదరాబాదులో సౌర విద్యుత్ ఉత్పత్తుల ప్రదర్శన
హైదరాబాదులో త్వరలో సౌర విద్యుత్ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు హైటెక్స్ లో ఈ ప్రదర్శన ఉంటుందని వేగా ఎన్విరాన్ సంస్థ సీఈవో రాజేష్ తెలిపారు. సోలార్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ఈ ప్రదర్శన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దుతామని రాజేష్ ప్రకటించారు.