: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె
శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల అనంతరం మాట్లాడుతూ వేతన సవరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మెకు నిశ్చయించినట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించిదన్నారు. ఒప్పంద కార్మికులను దశలవారీగా క్రమబద్దీకరిస్తామన్న ఆర్టీసీ యాజమాన్యాన్ని తాము నమ్మడం లేదన్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి.