: ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పదిలంగా ఉంటుంది!


మీ జ్ఞాపక శక్తి పదిలంగా ఉండాలనుకుంటున్నారా? అయితే తక్షణం పుస్తక పఠనం కానీ, రాయడం, బుర్రకు పదునుపెట్టే పనుల్లో పాలుపంచుకోవడం వంటి అలవాట్లు చేసుకోండి. అప్పుడు వృద్దాప్యంలో కూడా మీ జ్ఞాపక శక్తి పదిలంగా ఉంటుందని అమెరికా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. షికాగోలోని రష్ విశ్వవిద్యాలయ వైద్యకేంద్రానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. చిన్నతనం నుంచి వృద్దాప్యం వరకూ ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల వార్ధక్యంలో మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకుడు రాబర్ట్ ఎన్ విల్సన్ తెలిపారు.

  • Loading...

More Telugu News